ఆఫీసులకు వచ్చేందుకు ఐటీ ఉద్యోగులు ఆసక్తి చూపట్లే

ఆఫీసులకు వచ్చేందుకు ఐటీ ఉద్యోగులు ఆసక్తి చూపట్లే
  •     ఐటీ కంపెనీలకు 70 శాతం ఉద్యోగుల రిక్వెస్టులు
  •     దశలవారీగా పిలుస్తున్న మేనేజ్ మెంట్లు

హైదరాబాద్/కూకట్​పల్లి, వెలుగు: కరోనా కారణంగా క్లోజ్ అయిన ఐటీ కంపెనీలు ఒక్కొక్కటిగా ఓపెన్​అవుతున్నాయి. రెండేళ్లుగా వర్క్​ఫ్రం హోం చేస్తున్న ఎంప్లాయ్స్​ను మేనేజ్​మెంట్లు దశలవారీగా ఆఫీసులకు పిలుస్తున్నాయి. ప్రస్తుతం10 నుంచి 25 శాతం మంది ఆఫీసులకు వచ్చి పనిచేస్తున్నారు. కొన్ని కంపెనీలు మొత్తానికే రమ్మంటుండగా కొన్ని మాత్రం వారానికి మూడు రోజులు ఆఫీసుకు వస్తే చాలు అని చెబుతున్నాయి. మిగిలిన రోజులు ఇంటి నుంచే వర్క్​చేయమంటున్నాయి. కాగా 70 శాతం మంది ఐటీ ఉద్యోగులు ఆఫీసులకు వచ్చేందుకు ఇష్టంగా లేరని తెలుస్తోంది. వారిలోనూ 95 శాతం మంది మహిళా ఉద్యోగులు ఇంటి నుంచే వర్క్​చేస్తామని టీమ్​లీడ్స్ కు చెబుతున్నట్లు సమాచారం. ఇటీవల టీఎఫ్ఎంసీ వంటి సంస్థలు చేసిన ఆన్​లైన్​సర్వేల్లోనూ ఇదే తేలింది. ఈ నెల 1 నుంచి  కంపెనీలు ఓపెన్ అయినప్పటికీ ఆఫీసులకు వచ్చి వర్క్​చేసే ఉద్యోగుల శాతం తక్కువగానే ఉంటుందని ఐటీ, సాఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేర్ ఇండస్ట్రీల నిపుణులు అంటున్నారు. ఇంటి నుంచే అయితే కుటుంబ సభ్యులు, పిల్లలతో గడిపేందుకు ఎక్కువ సమయం దొరుకుతుందని, సిటీలోని ఇండ్ల రెంట్లు, పెట్రోల్, డీజిల్, వ్యక్తిగత ఖర్చులు ఉండవని ఉద్యోగులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

ప్రస్తుతానికి ఓకే.. కానీ

మహిళా ఉద్యోగుల రిక్వెస్టులను ఇప్పటికి ఓకే అంటున్న టీమ్ లీడ్స్ అవసరమైతే రావాల్సి ఉంటుందని చెబుతున్నారు. దశలవారీగా ముందు మేల్​ ఎంప్లాయ్స్​ను పిలుస్తున్నారు. వాళ్లంతా వచ్చాక మహిళా ఉద్యోగులను పిలవాలనే ఆలోచనలో కంపెనీలు ఉన్నాయి. అయితే వర్క్​ఫ్రం హోం కోరుకుంటుంది టైమ్, డబ్బు ఆదా కోసమేనని టెకీలు చెబుతున్నారు. ఉదయం లాగిన్​అయ్యేలోపు, సాయంత్రం లాగ్​అవుట్​అయ్యాక ఫ్యామిలీతో గడపొచ్చని, అదే సిటీకొచ్చి ఆఫీసులకు వెళ్లాలంటే బెడ్​దిగింది మొదలు పరుగులు తీయాల్సి ఉంటుందని అంటున్నారు. ట్రాఫిక్ సమస్య, అలసట, మానసిక ఒత్తిడి ఉండదని చెబుతున్నారు. అలాగే సిటీకొచ్చి మళ్లీ అద్దె ఇండ్ల వేటలో పడాలని పెళ్లయిన ఎంప్లాయ్స్​అంటుంటే, మళ్లీ హాస్టళ్లలో ఉండాలా బ్యాచిలర్లు అంటున్నారు. అయితే వర్క్ ఫ్రం హోం ​ విధానాన్ని అనుమతించే ఆస్కారమే లేదని కొన్ని పెద్ద పెద్ద కంపెనీలు అంటుంటే, మరికొన్ని ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. కొందరు ఉద్యోగులు వర్క్​ఫ్రం హోం 
కొనసాగించకపోతే రిమోట్​ఆఫ్షన్​ఇచ్చే కంపెనీకి చేంజ్ అవుతామని రిజైన్​ లెటర్లు ఇవ్వడమే కారణంగా తెలుస్తోంది.