Twitter Musk: ఆ 3 నెలలు కష్టంగా గడిచాయి.. మాకు మీ సపోర్ట్ కావాలి

Twitter  Musk: ఆ 3 నెలలు కష్టంగా గడిచాయి.. మాకు మీ సపోర్ట్ కావాలి

టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ట్విట్టర్ గురించి మరో సంచలన ట్వీట్ చేశారు. దివాలా తీసే స్థితిలో ఉన్న ట్విట్టర్ ను కాపాడుకునేందుకు ఎంతో కష్టపడ్డానని అన్నారు. గత 3 నెలలుగా సంస్థను నిలబెట్టేందుకు ఎంతో కృషి చేశానని, ఇప్పుడు అందరి సపోర్ట్ కావాలంటూ మస్త్ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. 

‘నష్టాల్లో కూరుకుపోయిన ట్విటర్ ను కాపాడటమే కాకుండా టెస్లా, స్పేస్ ఎక్స్ కంపెనీల నిర్వహణ విషయంలో గత 3 నెలలు చాలా కష్టంగా గడిచాయి. ఈ కష్టం మరెవరికీ రాకూడదు. ట్విట్టర్ కు ఇంకా చాలా సవాళ్లు ఉన్నాయి. ఈ సమయంలో నాకు ప్రజల సహకారం ఉంటే బాగుంటుంది’ అని ట్వీట్ చేశాడు. ట్విటర్ కొనుగోలు చేసిన తర్వాత మస్క్ 4వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించాడు. నష్టాలనుంచి గట్టెక్కేందుకు ఆఫీసులు మూసేస్తూ సామాన్లు అమ్మేస్తున్నాడు.