మధిర, వెలుగు: ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన ఐటీ హబ్ హామీని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అమలు చేశారు. మధిరలో ఐటీ హబ్ ఏర్పాటు చేస్తామని ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ, ఐటీ టవర్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేసింది.
బుధవారం మధిర పట్టణంలోని భట్టి విక్రమార్క క్యాంపు ఆఫీస్లో మధిర మున్సిపాలిటీ చైర్మన్ సామినేని సుజాత , జిల్లా కాంగ్రెస్ నాయకులు ఐటీ హబ్ మంజూరు పత్రాన్ని విడుదల చేసి మల్లు భట్టి విక్రమార్కకి ధన్యవాదాలు తెలిపారు.
