
హైదరాబాద్ తో పాటు తెలంగాణాలోని చిన్న పట్టణాల్లో కూడా ఐటి హబ్ లు ఏర్పాటు చేస్తామన్నారు మంత్రి కేటీఆర్. ఇప్పటికే కరీంనగర్ లో IT టవర్ నిర్మాణం పూర్తయిందని, అక్టోబర్లో దీన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇవాళ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో భాగంగా జరిగిన ప్రశ్నోత్తరాల్లో ఐటీ పరిశ్రమ బలోపేతానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు చెప్పాలని సభ్యులు అడిగిప ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. గడిచిన ఐదేళ్లలో ఐటీ ఎగుమతులు రెట్టింపు చేశామన్నారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణలో ఐటీ ఎగుమతుల విలువ రూ.52వేల కోట్లు కాగా, 2018-19 ఆర్థిక సంవత్సరం నాటికి 100% నికి పైగా పెరిగి లక్షా 10 వేల కోట్ల రూపాయలకు చేరిందన్నారు.
హైదరాబాద్ నలువైపులా ఐటీని విస్తరించామని తెలిపారు మంత్రి కేటార్. మహబూబ్‌నగర్ ఐటీ టవర్‌కు టెండర్ పూర్తయిందని, 50 ఎకరాల స్థల సేకరణ జరిగిందని చెప్పారు. ద్వితీయ శ్రేణి పట్టణాల్లోనూ బీపీవో సంస్థలు ప్రారంభం అయ్యాయన్నారు. దేశవ్యాప్తంగా ఐటీఐఆర్ లో 8శాతం వృద్ధి ఉందన్న కేటీఆర్.. తెలంగాణలో 17శాతానికిపైగా నమోదైందన్నారు. 2013లో ఐటీఐఆర్ పాలసీ తీసుకొచ్చిన యూపీఏ ప్రభుత్వం… ఒక్కపైసా కూడా ఇవ్వలేదన్నారు. NDA ప్రభుత్వం వచ్చాక దాదాపు పదిసార్లు నేరుగా కలిసి అడిగామని, లేఖలు రాసినా లాభం లేకపోయిందని అన్నారు. కేంద్ర నిధులు వ్వకపోయినా ఐటీ అభివృద్ధి ఆగలేదన్నారు కేటీఆర్.