కాలాహండిలో అంత్యక్రియలు చేసేందుకు ఇక్కట్లు

కాలాహండిలో అంత్యక్రియలు చేసేందుకు ఇక్కట్లు

కాలాహండి (ఒడిశా): ఎడతెరిపి లేని వర్షాలకు చాలా రాష్ట్రాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఒడిశాలోనూ ఇదే పరిస్థితి. దీంతో అక్కడ అంత్యక్రియలు చేయడం కూడా కష్టంగా మారింది. చాతీ లోతు వరదనీటిలో పాడెను మోసుకెళ్లి దహన సంస్కారాలు నిర్వహించారు. కాలాహండి జిల్లా గోలముండా బ్లాక్‌లోని బెహెరాగూడలో జరిగిందీ ఘటన.

గ్రామానికి చెందిన శాంతారాణా చాలా కాలంగా పక్షవాతంతో బాధపడుతూ మంగళవారం చనిపోయారు. దీంతో అంత్యక్రియలు నిర్వహించడానికి వరదనీటిలో బెహెరాగూడ గ్రామవాసులు చాలా కష్టపడ్డారు. వాగుకు అవతలి వైపు శ్మశాన వాటిక ఉండటం, బ్రిడ్జి లేకపోవడంతో చాతీ లోతు నీళ్లలో వెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.