ఐపీఎల్ 19లో భాగంగా మంగళవారం (ఏప్రిల్ 14) చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడనున్నాయి. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్ స్టార్ట్ కానుంది. అయితే, గాయం కారణంగా సీజన్ తొలి నాలుగు మ్యాచులకు దూరమైన చెన్నై మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ కేకేఆర్‌తో మ్యాచ్‌లోనైనా బరిలోకి దిగుతాడా లేదా అని అభిమానుల్లో గందరగోళం నెలకొంది.
తమ అభిమాన ఆటగాడిని గ్రౌండ్లో చూడాలని తలా ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. చెన్నై మేనేజ్మెంట్ వర్గాల ప్రకారం కేకేఆర్‌తో మ్యాచులో కూడా ధోనీ ఆడకపోవచ్చు. గాయం పూర్తిగా నయం కాకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. కేకేఆర్‌తో మ్యాచ్‌కు ముందు జరిగిన ప్రాక్టీస్ సెషన్‌కు కూడా ధోనీ దూరంగా ఉన్నాడు. మిస్టర్ కూల్ తిరిగి ఎప్పుడు మైదానంలోకి దిగుతాడనే దానిపై ఎలాంటి సమాచారం లేదు. దీంతో తలాను గ్రౌండ్లో చూడాలనుకున్న అభిమానులు మరికొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు.
చెన్నై, కోల్‌కతాది ఒకటే పరిస్థితి:
ఐపీఎల్లో మోస్ట్ సక్సెస్ ఫుల్ జట్లుగా పేరున్న చెన్నై, కోల్‌కతా ఈ సీజన్‌ను అతి దారుణంగా ఆరంభించాయి. ఇరు జట్లు ఆడిన తొలి మ్యాడు మ్యాచుల్లో ఓటమి పాలయ్యాయి. రుతురాజ్ గైక్వాడ్ నాయకత్వంలోని సీఎస్‌కే నాలుగో మ్యాచ్‌లో ఎట్టకేలకు డీసీపై విజయం సాధించాయి టోర్నీలో బోణీ కొట్టింది.
ఆడిన నాలుగు మ్యాచుల్లో మూడు ఓడిపోగా.. ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అవడంతో ఈ టోర్నీలో కేకేఆర్ ఇంకా విజయాల ఖాతా తెరవలేదు. దీంతో చెన్నైపై గెలిచైనా బోణీ కొట్టాలని కేకేఆర్ భావిస్తోంది. మరోవైపు గెలుపు జోష్‌లో ఉన్న సీఎస్కే సొంతగడ్డపై కేకేఆర్‌ను చిత్తు చేసి టోర్నీలో రెండో విజయం నమోదు చేయాలని చూస్తోంది.

