ఇయ్యాల (సెప్టెంబర్ 14) కూడా వాన దంచి కొడ్తదంట.. ఈ జిల్లాల ప్రజలు జైర పైలం !

ఇయ్యాల (సెప్టెంబర్ 14) కూడా వాన దంచి కొడ్తదంట.. ఈ జిల్లాల ప్రజలు జైర పైలం !

తెలంగాణలో గత కొద్ది రోజులుగా కుండపోత వానలు కురుస్తున్నాయి. వారం వానలు.. రెండు మూడు రోజులు గ్యాప్.. అన్నట్లుగా దంచికొడుతున్నాయి వర్షాలు. భారీ వర్షాల కారణంగా ఇప్పటికే పలు జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. నిర్మల్, మెదక్, కామారెడ్డి.. తదితర జిల్లాలు దారుణంగా దెబ్బతిన్నాయి. కాస్త తెరపిచ్చినట్లే కనిపించిన వానలు మళ్లీ పుంజుకున్నాయి. 

ఆదివారం (సెప్టెంబర్ 14) ఉదయం నుంచి కూడా తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యంగా హైదరాబాదులో వాతావరణం మేఘావృతమై ఉంది. గత రెండు రోజులుగా ఈ వాతావరణం కొనసాగుతోంది. 
అయితే ఇవాళ (ఆదివారం) మధ్యాహ్నం తర్వాత భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. 

ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలకు ఛాన్స్:

ఆదిలాబాద్, యాదాద్రి భువనగిరి జిలాల్లో మోస్తారు వర్షాలకు ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. అదే విధంగా హైదరాబాద్ లో కొన్ని ప్రాంతాల్లో వానలు కురుస్తాయని తెలిపారు.

ఇటు భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, హైదరాబాద్, జయశంకర్ భూపాలపల్లి, జగిత్యాల, జనగాం, ఖమ్మం, కొమురం భీమ్ ఆసిఫాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, మహబూబాబాద్, మంచిర్యాల, ములుగు,  నల్గొండ, నిర్మల్, పెద్దపల్లి, రంగారెడ్డి,  సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, వరంగల్ జిల్లాల్లో సాయంత్రం వరకు తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని.. రైతులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.