ఆ దేవుడే నాతో మహిళా బిల్లు పెట్టిస్తున్నారు : కొత్త పార్లమెంట్లో మోదీ తొలి స్పీచ్

ఆ దేవుడే నాతో మహిళా బిల్లు పెట్టిస్తున్నారు : కొత్త పార్లమెంట్లో మోదీ తొలి స్పీచ్

కొత్త పార్లమెంట్ ప్రారంభం అయ్యింది. తొలి స్పీచ్ ఇచ్చారు ప్రధాని మోదీ. 2023, సెప్టెంబర్ 19వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఆయన ఎంపీలతో కలిసి కొత్త లోక్ సభలోకి అడుగు పెట్టారు. ఆ తర్వాత తొలి ప్రసంగం కూడా మోదీనే చేశారు. ప్రపంచం అంతా మారుతుందని.. మనం కూడా మారాలని.. పార్టీల కోసం కాకుండా ప్రజలకు సేవ చేసే కోణంలో అందరూ ఆలోచించాలని సూచించారు. కొత్త పార్లమెంట్ కొత్త విధానాలు, చట్టాలు ప్రజల కోసం తీసుకు రావాల్సిన అవసరం ఉందని ఎంపీలను ఉద్దేశించి మాట్లాడారు మోదీ.

కొత్త పార్లమెంట్లో తొలి చట్టం.. మహిళా బిల్లు కావటం విశేషం అన్నారు. ఇంతటి అదృష్టాన్ని దేవుడే నాకు కల్పించినట్లు ఎమోషనల్ అయ్యారు మోదీ. 2023, సెప్టెంబర్ 19వ తేదీ అనేది చారిత్రాత్మకమైన రోజు అని.. దేశంలోనే కీలకమైన ఘట్టంగా అభివర్ణించారు మోదీ.  మహిళా రిజర్వేషన్ బిల్లును నారీ శక్తి వందన్ పేరుగా నామకరణం చేశారు మోదీ. దేశ మహిళలకు ఇస్తున్న గౌరవంగా స్పష్టం చేశారు మోదీ. 

Also Read :- విశ్వమిత్రుడిగా భారత్..ఉజ్వల భవిష్యత్ నిర్మించే బాధ్యత ఎంపీలదే

స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొత్తం 7 వేల 500 మంది ఎంపీలు ప్రాతినిధ్యం వహించారని.. వీరిలో మహిళల శాతం చాలా తక్కువగా ఉండటం బాధాకరమన్నారు. గత ప్రభుత్వాలు మహిళా బిల్లు విషయంలో నిర్లక్ష్యం వహించాయని దుయ్యబట్టారు మోదీ. పార్లమెంట్, రాష్ట్రాల అసెంబ్లీల్లో 33 శాతం మహిళా సభ్యుల రాకకు అందరూ స్వాగతించాలని.. ఆహ్వానించాలని అన్ని పార్టీల ఎంపీలను కోరారు మోదీ.