
ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశంగా భారతదేశం నిలుస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భారత పరిపాలన విధానం, యూపీఐ వంటి వాటిపై విశ్వవ్యాప్తంగా చర్చ జరుగుతోందని చెప్పారు. పార్లమెంట్ సెంట్రల్ హాలులో చివరి జాయింట్ సెషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రసంగించారు.
పాత పార్లమెంట్ భవనంలో ఎన్నో బిల్లులను రూపొంచామని ప్రధాని మోదీ గుర్తు చేశారు. ట్రాన్స్ జెండర్లకు న్యాయం జరిగే బిల్లు, ట్రిపుల్ తలాక్ బిల్లు, దివ్యాంగుల ఉజ్వల భవిష్యత్ కోసం బిల్లులు,ఆర్టికల్ 370 రద్దు చేసే బిల్లులను ఈ సభలోనే ఆమోదించామన్నారు. ఉగ్రవాదం, వేర్పాటువాదానికి వ్యతిరేకంగా పోరాడగలుతున్నామని చెప్పారు. సరికొత్త చైతన్యంతో భారత్ ఇప్పుడు పునర్ వైభవం పొందుతోందన్నారు ప్రధాని మోదీ.
ఉజ్వల భవిష్యత్ నిర్మించే బాధ్యత ఎంపీలదే అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ప్రపంచమంతా ఆత్మనిర్భర్ గురించి చర్చిస్తోందన్నారు. జీరో డిఫెక్ట్..జీరో ఎఫెక్ట్ గా భారత్ తయారీ రంగంలో నిలవాలని ఆకాంక్షించారు. తయారీ రంగంలో ప్రపంచంలోనే భారత్ అగ్రస్థానంలో నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జీ20 దేశాధినేతలకు నలందా ఫోటోను చూపానని చెప్పారు. మన ఆలోచనలను విస్తృతం చేయకపోతే పెద్దల కలలను కనలేమన్నారు. 75 ఏళ్ల అనుభవం మనకు ఉందని.... చిన్న చిన్న విషయాలపై రాద్ధాంతం వద్దని కోరారు.
ALSO READ: పార్లమెంట్ భవనం ఎదుట ఎంపీల గ్రూపు ఫొటో
ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ జనాభా ఉన్న దేశం మనదన్నారు ప్రధాని మోదీ. ప్రపంచంలోనే ఎక్కువగా యువకులు ఉన్న దేశం భారతదేశం అని చెప్పారు. యువ శక్తి సామర్థ్యం, సాహసాలపై మనకు నమ్మకం ఉందన్నారు. భారతీయులు ఏ దేశానికి వెళ్లినా..అక్కడ తమ ముద్ర వేశారని కొనియాడారు. క్రీడా ప్రపంచంలో మన క్రీడాకారులు ఉజ్వలంగా నిలుస్తున్నారని చెప్పారు. మన దృష్టి అంతా క్వాలిటీపై కేంద్రీకరించాలని...నైపుణ్య మానవుల అవసరం ప్రస్తుతం ప్రపంచానికి ఉందన్నారు.
భవిష్యత్ కోసం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాలన్నా ప్రధాని మోదీ. మిషన్ హైడ్రోజన్ పర్యావరణ సమస్యలకు దారి చూపుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భావితరాలకు తాగునీటికి ఇబ్బంది రాకుండా ఇప్పుడే ఆలోచన చేస్తున్నామని వెల్లడించారు. ఒకప్పుడు అవసరాల కోసం అలీన ఉద్యమంలో భాగంగా నిలిచామని... ఇప్పుడు విశ్వమిత్రుడిగా ఎదిగామన్నారు.