నాకు రైతే ముఖ్యం

నాకు రైతే ముఖ్యం

నిజామాబాద్: వ్యవసాయ బిల్లుపై రైతులతో అవగాహన సమావేశాలు ఏర్పాటు చేస్తామన్నారు ఎంపీ అరవింద్. శుక్రవారం శ్రద్ధానంద్ గంజ్ మార్కెట్ యార్డులో పసుపు ట్రేడర్స్ సమావేశంలో పాల్గొని మాట్లాడిన అరవింద్..ఈ బిల్లుపై ఉన్న అపోహలు తొలగిస్తున్నామన్నారు. మార్కెట్ యార్డులో ఏ సమస్య ఉన్న తనను సంప్రదించవచ్చన్నారు. ఈ బిల్లులో మార్కెట్ యార్డు తొలగించమని చెప్పలేదన్నారు. మార్కెట్ యార్డులను విస్తీర్ణం చేయటమే బీజేపీ  లక్ష్యం అని..రైతు పంటను ఎక్కడైనా అమ్ముకునేలా మాత్రమే ఈ బిల్లులో తెలిపామన్నారు. నాకు రైతే ముఖ్యమన్న అరవింద్..భారత ఆర్థిక వ్యవస్తలో 75శాతం వాటా రైతులదేనన్నారు.

కొత్త వ్యవసాయ చట్టం పూర్తిగా అమలైతే రైతులు రోడ్డెక్కే అవసరం ఉండదన్నారు. నూతన వ్యవసాయ చట్టం వల్ల వ్యాపారులకు, మార్కెట్ కి ఇబ్బంది ఉండదని..రైతులను బాగుపరిచే విధంగా మనం పని చేద్దామన్నారు. రైతులకు మేలు జరిగితేనె మార్కెట్ యార్డులు అభివృద్ధి చెందుతాయని..నూతన వ్యవసాయ చట్టం వల్ల పారదర్శకత పెరుగుతుందన్నారు. ప్రపంచ మార్కెట్లో ఇండియాకి పేరొస్తుందని..నిజామాబాద్ పసుపుకి ప్రపంచ మార్కెట్లో గుర్తింపు ఉందన్నారు. దాన్ని కాపాడుతూనే రైతులకు మేలు జరిగేలా చేయాలన్నారు. నిజామాబాద్ మార్కెట్ యార్డు అభివృద్ధికి తన వంతు సాయం అందిస్తానని తెలిపారు ఎంపీ అరవింద్.