కేసీఆర్ బలి తీసుకున్న కాళేశ్వరమే.. కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను బలి తీసుకుంటది : రేవంత్

కేసీఆర్ బలి తీసుకున్న కాళేశ్వరమే.. కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను బలి తీసుకుంటది : రేవంత్
  • బీఆర్ఎస్, బీజేపీ అవినీతి వల్లే ప్రాజెక్టు నాశనమైందని ఫైర్​

హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌కు ఓడిపోతామన్న భయం పట్టుకున్నదని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. కేంద్రంతో కేసీఆర్ చేతులు కలిపారని, అందుకే కేంద్ర ప్రభుత్వ సాయంతో కాంగ్రెస్ నాయకులపై ఐటీ దాడులు చేయిస్తున్నారని ఫైర్ అయ్యారు. మహేశ్వరం కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ క్యాండిడేట్ కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, బడంగ్ పేట్ మేయర్ పారిజాతా రెడ్డిపై జరిగిన ఐటీ దాడులపై గురువారం ఆయన స్పందించారు. శంషాబాద్ ఎయిర్​పోర్ట్ వద్ద మీడియాతో రేవంత్ మాట్లాడుతూ.. ‘‘మహేశ్వరంలో సబితా ఇంద్రారెడ్డి ఓడిపోతారని బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌కు అర్థమైపోయినట్టుంది. అందుకే కేంద్రం సహకారంతో కాంగ్రెస్ లీడర్లపై ఐటీ దాడులు చేయిస్తున్నారు. ఎన్ని కుట్రలు పన్నినా కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఓడించి తీరుతాం. మోదీ కంకణం కట్టుకుని కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను గెలిపించాలనుకున్నా అది జరగని పని. మీ కుట్రలను తెలంగాణ సమాజం తిప్పికొడుతుంది.. కేసీఆర్​ను పడగొడుతుంది’’ అని చెప్పారు.

వేల కోట్ల ప్రజాధనం వృథా

కేసీఆర్ అంటే కాళేశ్వరం కరప్షన్ రావు అనే కాడికి పరిస్థితి వచ్చిందని రేవంత్ ఎద్దేవా చేశారు. నాసిరకం పనులతో వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. కేసీఆర్ ఫ్యామిలీ అవినీతికి కాళేశ్వరం ప్రాజెక్టు బలైపోయిందని.. ఆ ప్రాజెక్టే కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నూ బలి తీసుకుంటుందని చెప్పారు. గుడినీ, గుడిలో లింగాన్ని దిగమింగిన కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తెలంగాణ సమాజం శిక్షించాలని కోరారు. కేసీఆర్ పాపం పండిందని, ఆయన అవినీతి కుండ పగిలిందని అన్నారు. మేడిగడ్డ కుంగి రూ.లక్ష కోట్ల ప్రజాధనం గోదావరిలో పోసినట్లు అయిందని చెప్పారు. ‘‘బీఆర్ఎస్ అవినీతిని బీజేపీ కాపాడుతున్నది. ఆ రెండు పార్టీల అవినీతికి ప్రాజెక్ట్ పాడైపోయింది. సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ప్రాజెక్టు పిల్లర్లు కుంగాయి. 25వ పిల్లర్ నుంచి ఒకటో పిల్లర్ కుంగాయి. దాదాపు రెండున్నర ఫీట్ల మేర కుంగిపోయాయని అధికారులే స్వయంగా చెప్తున్నారు. మేడిగడ్డలో సగం ప్రాజెక్టును కూల్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. మిగతా సగం ప్రాజెక్ట్​పరిస్థితి ఏంటన్నది కూడా సాంకేతిక నిపుణులు పరిశీలిస్తే తప్ప తెలియదు. ఎల్అండ్‌‌‌‌‌‌‌‌టీని బ్లాక్ లిస్ట్​లో పెట్టాలి. సంబంధిత అధికారులు, ఇంజనీర్లపై క్రిమినల్ కేసులు పెట్టాలి” అని ఆయన డిమాండ్ చేశారు.