ఇయ్యాల్టి నుంచి 4 రోజులు వానలు

ఇయ్యాల్టి నుంచి 4 రోజులు వానలు

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్రంలోని పలు చోట్ల ఆదివారం నుంచి నాలుగు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడవచ్చని హైదరాబాద్‌‌ వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో శనివారం రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి జల్లులు కురిశాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు చిరు జల్లులు పడ్డాయి. 9 చోట్ల మోస్తరు వానలు, 247 ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు, 247 చోట్ల చినుకులు పడ్డాయి. రంగారెడ్డి జిల్లాలోని గునగల్‌‌, నల్గొండలోని తిమ్మాపూర్‌‌లో 2.6 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది.