హైదరాబాద్ లో పలు చోట్ల వర్షం

హైదరాబాద్ లో పలు చోట్ల వర్షం

రాష్ట్రంలో పలు చోట్ల వర్షం కురుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తెల్లవారుజాము నుంచి వర్షం పడుతోంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం వస్తోంది. వాతావరణం పూర్తిగా చల్లగా ఉంది. పలు చోట్ల కురిసిన వర్షంతో హైదరాబాద్ నగరం తడిసి ముద్దయ్యింది. కొన్నిచోట్ల విద్యుత్ నిలిచిపోయింది. ఇటు ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12 లో రోడ్డుకు అడ్డంగా మెయిన్ పవర్ కేబుల్ కింద పడిపోయింది. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వాహనాల రాకపోకలకు వీల్లేకుండా పవర్ కేబుల్ అడ్డంగా పడింది. ఇటు కుత్బుల్లాపూర్ పరిసర ప్రాంతాల్లోనూ వర్షం కురుస్తోంది. 

దేశంలోని పలు రాష్ట్రాల్లో వడగాల్పులు వీస్తాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) హెచ్చరించింది. వచ్చే మూడు నాలుగు రోజులు బెంగాల్‌‌‌‌‌‌‌‌, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌‌‌‌‌‌‌‌, బీహార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాష్ట్రాల్లో వడగాల్పులు వీస్తాయని గురువారం (ఏప్రిల్ 13న) తెలిపింది. దేశంలోని సెంట్రల్‌‌‌‌‌‌‌‌, ఈస్ట్‌‌‌‌‌‌‌‌, నార్త్‌‌‌‌‌‌‌‌వెస్ట్‌‌‌‌‌‌‌‌లోని చాలా ప్రాంతాల్లో వేడి గాలులు వీచే అవకాశం ఉందని చెప్పింది. 

ఏప్రిల్‌‌‌‌‌‌‌‌ 17న పశ్చిమ బెంగాల్‌‌‌‌‌‌‌‌లోని గంగానది పరివాహాక ప్రాంతాల్లో, ఏప్రిల్‌‌‌‌‌‌‌‌ 15న ఏపీలోని ఉత్తర కోస్తాతో పాటు ఒడిశాలో, ఏప్రిల్‌‌‌‌‌‌‌‌ 15 నుంచి 17 వరకు బీహార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని పలు ప్రాంతాల్లో వేడిగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.