దేవరలో ఈ ఒక్క వర్క్ కోసం రూ.150 కోట్లు అంట ..

దేవరలో ఈ ఒక్క వర్క్ కోసం రూ.150  కోట్లు అంట ..

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్(NTR)-స్టార్ డైరెక్టర్ కొరటాల శివ( Koratala Shiva) కాంబినేషన్‌లో వస్తోన్న మూవీ దేవర.ఈ మూవీ పై  టాలీవుడ్‌లో భారీ అంచనాలున్నాయి. వీరిద్దరి కాంబోలో వచ్చిన జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బస్టర్ తరువాత మూవీ కావడంతో ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. 

లేటెస్ట్ అప్డేట్ ప్రకారం దేవర కోసం కళ్ళు బయర్లు కమ్మే లెవెల్లో యాక్షన్ సీన్స్ డిజైన్ చేస్తున్నారట డైరెక్టర్. ఇందుకోసం దేవర ప్రొడ్యూసర్స్ రూ.150కోట్ల బడ్జెట్ను..కేవలం VFX వర్క్కు కేటాయించినట్లు సమాచారం. పాన్ ఇండియా లెవెల్లోప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీని ఎన్టీఆర్ ఆర్ట్స్‌-యువసుధ ఆర్ట్స్ నిర్మిస్తున్నారు. 

దేవర మూవీని దాదాపు రూ.300 కోట్ల భారీ బడ్జెట్​తో తెరకెక్కిస్తున్నారని..ఎక్కడ రాజీ పడట్లేదని తెలుస్తుంది. వరల్డ్ వైడ్గా ఫేమస్ అయినా ప్రముఖ హాలీవుడ్ టెక్నిషియన్స్, కొరియోగ్రాఫర్స్, దేవర కోసం వర్క్ చేస్తున్నారట. ఇప్పటికే ఈ మూవీ సగానికి పైగా  షూటింగ్ కంప్లీట్ అవ్వగా..కొన్ని సీన్స్ ని VFX టీంకి పంపించారని సమాచారం. 
  
ప్రస్తుతం షెరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో..బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్(Janhvi kapoor) హీరోయిన్ గా నటిస్తోంది. ఇక్కడ మరో విశేషం ఏంటంటే..ఈ సినిమాలో బాలీవుడ్ హీరో సైఫ్ ఆలీ ఖాన్(Saif ali khan) విలన్ గా నటిస్తున్నాడు. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా APR 5న 2024 లో రిలీజ్ కానుందని మేకర్స్ ప్రకటించారు.