భక్తుల జేబు గుల్ల.. గుండుకు రూ.200

భక్తుల జేబు గుల్ల.. గుండుకు రూ.200

కొండగట్టు, వెలుగు: కొండగట్టులో భక్తులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. కోరిన కోర్కెలు తీర్చే కొండగట్టు అంజన్నకు తలనీలాలను సమర్పించడం ఆనవాయితీ. దీన్ని ఆసరాగా తీసుకున్న కొందరు లాక్ డౌన్ రూల్స్​ ఉల్లంఘించి రూ.200 నుంచి 300 వసూలు చేస్తూ భక్తుల జేబు గుల్ల చేస్తున్నారు. లాక్​డౌన్​ సడలింపులతో ఈ నెల 8 నుంచి భక్తులను స్వామి దర్శనానికి అనుమతిస్తున్నారు. సాధారణంగా తలనీలాలకు రూ. 10 టిక్కెట్టు ఉంటుంది. అయితే ప్రస్తుతం లాక్​డౌన్​రూల్స్​కారణంగా భక్తుల తలనీలాలు తీసేందుకు పర్మిషన్​లేదు. అయితే టెండరుదారుని వద్ద పనిచేస్తున్న వ్యక్తులు కొందరు గుట్టపైకి వెళ్లే దారిలో ప్రైవేట్ ల్యాండ్ గదుల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా భక్తుల తలనీలాలు సేకరిస్తున్నారు. ఒక్కో భక్తుడి నుంచి రూ. 200  నుంచి 300 వరకు వసూలు చేస్తున్నారు. మరోవైపు సామూహికంగా ఒకేచోట స్నానాలు చేస్తుండడంతో వైరస్ సోకే ప్రమాదం ఉంది.

రూ. 300 తీసుకున్నరు

మేం వరంగల్ నుంచి వచ్చాం. గుట్టపైకి దర్శనానికి వెళ్తే ఇక్కడ తలనీలాలు తీస్తున్నారని చెప్పారు. ఇక్కడికి వస్తే రూ. 300 వసూలు చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఇయ్యాల్సి వచ్చింది. ‑ ప్రవీణ్, హన్మకొండ

పోలీసులకు సమాచారం ఇచ్చాం

తలనీలాల సేకరణ మా దృష్టికి వచ్చింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించాం. భక్తులను దోపిడీ చేస్తే ఊరుకోం. కఠిన చర్యలు తీసుకుంటాం.

‑ కృష్ణ ప్రసాద్ ఈవో

హోం కంటెయిన్ మెంట్లలో చెత్త ఎత్తేదెట్ల?