SRSP కింద ఉన్న చెరువులు, కుంటలు నింపండం ప్రభుత్వ బాధ్యత

SRSP కింద ఉన్న చెరువులు, కుంటలు నింపండం ప్రభుత్వ బాధ్యత

తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా చెరువులు,కుంటలు నింపడం కోసం ప్రణాళికలు చేపట్టిందో.. అలాగే ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్ట్ (శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్) కింద కూడా చెరువుల కుంటలు నింపాలని ఎమ్మెల్సీ జీవ‌న్ రెడ్డి అన్నారు. కాకతీయ కాలువ నుంచి వరద కాలువ లింక్ అనుసంధానం చేయకపోవడం వళ్లే రైతాంగానికి ఇబ్బందులు త‌లెత్తుతున్నాయ‌ని అన్నారు. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలంలో సాగు నీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుండటం తో జీవన్ రెడ్డి పంట పొలాలను,ఎండిన చెరువులను పరిశీలించారు.

కాకతీయ కాలువ, వరద కాలువ వద్ద అనుసంధానం చేస్తే ఎస్.ఆర్.ఎస్.పి చివరి ఆయకట్టు వరకు నీరు అందించవచ్చని అన్నారు.ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్ట్ లో రబి సీజన్ పంటకు అందించేంత నీళ్లున్నా.. లింక్ అనుసంధానం నిర్లక్ష్యం వల్లే నీరు అందించలేని పరిస్థితి నెలకొందని అన్నారు. కాకతీయ ఎగువన ఉన్న ఆయకట్టు కింద ఉన్న చెరువులను కుంటల నింపాల్సిన బాధ్యత ప్రభుత్వనిదని, ఎస్ ఆర్ ఎస్పీ చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించాలన్నారు. జంగల్ నాలా ప్రాజెక్ట్ నింపకపోవడం వల్లే వెల్గటూర్ మండలం రైతాంగం ఇబ్బందులు పడుతున్నారని, రెండు రోజుల్లో పంట పొలాలకు నిరందించకపోతే రోడ్డు పై ధర్నా, రాస్తారోకోలు చేస్తామ‌ని చెప్పారు జీవ‌న్ రెడ్డి.