విదేశీ కుట్ర వల్ల వరదలు వచ్చాయనడం దురదృష్టకరం

విదేశీ కుట్ర వల్ల వరదలు వచ్చాయనడం దురదృష్టకరం
  • వరదలపై శాస్త్రీయ సమీక్ష చేయాలె
  • పర్యావరణ వేత్త దొంత నర్సింహ రెడ్డి

ఖైరతాబాద్, వెలుగు :  రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాలతో ముంపు ప్రాంతాల్లో వచ్చిన వరదలకు క్లౌడ్ బరస్ట్​ కారణమని సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అర్థరహితమని పర్యావరణవేత్త దొంతి నర్సింహ రెడ్డి అన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్​లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. విదేశీ కుట్ర వల్ల వరదలు వచ్చాయని సీఎం చెప్పడం దురదృష్టకరమన్నారు. తెలంగాణకు సైన్స్ ఆధారిత ప్రజా విధానాలు..విపత్తు నిర్వహణ ప్రణాళికలు అవసరమని నర్సింహరెడ్డి  స్పష్టం చేశారు. పర్యావరణ నిపుణుల సలహాలు, సూచనలు తీసుకోకుండా వరదలపై సీఎం కేసీఆర్ నోటికొDచ్చింది మాట్లాడారని విమర్శించారు.  వరదల వెనకున్న కారణాలపై శాస్త్రీయ సమీక్ష జరపాల్సిన అవసరముందన్నారు. ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునే విధానాలను అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన సుచించారు. పర్యావరణవేత్త బీవీ సుబ్బారావు మాట్లాడుతూ..రాష్ట్రంలో వాతావరణం మారుతున్నా ఒక్కరూ పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. వరదలు వచ్చినప్పుడు క్లౌడ్ బరస్ట్​పై  చర్చ జరగడం హాస్యాస్పదమన్నారు. గతంలో రిజర్వాయర్లపై రివ్యూ చేద్దామన్న సీఎం కేసీఆర్ దాన్ని పట్టించుకోవడం లేదన్నారు. కార్యక్రమంలో పర్యావరణ వేత్త సాయి భాస్కర్, సీనియర్ ఎడిటర్ దిలీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.