పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్మానేపల్లి జ్యువెలర్స్‌లో ఐటీ అధికారులు మంగళవారం సోదాలు నిర్వహించారు. ఉదయం 6 గంటల నుంచి సోదాలు నిర్వహించిన ఆదాయపు పన్ను శాఖ అధికారులు దుకాణంలోని పలు డాక్యుమెంట్లు పరిశీలించారు.
ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నా యన్న ఫిర్యాదుల మేరకు ఐటీ అధికారులు సోదాలను నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఇంకా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
