
కోరుట్ల, వెలుగు: సాయుధ పోరులో అడవి బాట పట్టి మావోయిస్టు ఉద్యమంలోకి వెళ్లిన చెల్లి నాలుగు దశాబ్దాల తర్వాత అన్నకు రాఖీ కట్టింది. జగిత్యాల జిల్లా కోరుట్ల టౌన్ కు చెందినపసుల శాంతక్క 40 ఏండ్ల కింద వెళ్లి దండకారణ్యంలో మావోయిస్టుగా చేసింది. కేంద్ర కమిటీ సభ్యురాలిగా, నార్త్బస్తర్ డివిజన్ ఇన్చార్జ్ గా ఆమె వ్యవహరిస్తూ.. అనారోగ్యం కారణంగా నాలుగు నెలల కింద ఛత్తీస్ గఢ్ పోలీసుల ఎదుట లొంగిపోయారు.
అనంతరం కోరుట్ల టౌన్ లో అత్తగారింటికి వచ్చి ఉంటుంది. రాఖీ పండుగ సందర్భంగా శనివారం శాంతక్క పుట్టిల్లు కథలాపూర్మండలం సిరికొండ గ్రామానికి వెళ్లింది. అన్న బత్తుల రాజంకు రాఖీ కట్టింది. 40 ఏండ్ల తర్వాత అన్నకు రాఖీ కట్టడం చాలా సంతోషంగా ఉందని చెప్పి ఆమె భావోద్వేగానికి గురైంది.