హైదరాబాద్ లో బంగారం షాపులపై ఐటీ సోదాలు

హైదరాబాద్ లో బంగారం షాపులపై ఐటీ  సోదాలు

హైదరాబాద్ లోని ముసదిల్లాల్ జెమ్స్, జ్యువెలరీ షాపులుపై ఐటీ సోదాలు జరిగాయి. గోల్డ్ స్టాక్, అమ్మకాలపై ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు ఆరా తీశారు . ఎర్రమంజిల్ లోని ముసదిల్లాల్ జేమ్స్ ఎండ్ జ్యూవెలరీ బ్రాంచ్ లలో ఏకకాలంలో తనిఖీలు చేశారు. ఉదయం నుంచే అధికారులు సెర్చింగ్ మొదలైంది. ఉదయం బ్యాంక్ లావాదేవీలు పరిశీలించారు అధికారులు. మధ్యాహ్నం వాల్యూవేటర్ ను పిలిపించి గోల్డ్ స్టాక్, అమ్మకాల వివరాలు పరిశీలించారు. షో రూమ్ లోని గోల్డ్ అంతా లెక్కిస్తున్నారు. షో రూమ్ లోని స్టాక్, సేల్స్ రికార్డ్ లపై ఫోకస్ పెట్టారు అధికారులు. సేల్స్ టాక్స్ ఇన్వాయిస్ ల్లో గోల్ మాల్ జరిగినట్టు ఆరోపణలున్నాయి. గోల్డ్  స్టాక్ రికార్డులు చూపించడంలో అవకతవకలు జరిగాయనే అభియోగాలు విచారిస్తున్నారు. సోదాలకు CRPF పోలీస్ టీమ్స్ సెక్యూరిటీ కల్పిస్తున్నారు. 

మరోవైపు సికింద్రాబాద్ ప్యారడైజ్ దగ్గర ఉన్న  ముసద్దీలాల్ జెమ్స్ అండ్ జువెల్స్ షోరూంలో కూడా ఈడీ సోదాలు జరిగాయి. బ్యాంకుల నుండి తీసుకున్న రుణాల ఎగవేతపై గతంలో సీబీఐ కేసు నమోదైంది. పెద్ద నోట్ల రద్దు సమయంలో నల్లధనాన్ని మార్చుకునేందుకు బోగస్ అమ్మకాలు జరిపినట్టు ముసద్దిలాల్ జ్యుయలరీపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ముసద్దిలాల్ జ్యుయలరీ  డైరెక్టర్లు మోహన్ లాల్ గుప్తా, ప్రశాంత్ గుప్తాపై  సీబీఐ కేసు నమోదు చేసింది . ఇండియన్ ఓవర్సీసిస్ బ్యాంకు నుండి 75 కోట్లు, INNG బ్యాంకు నుంచి  55 కోట్ల 80 లక్షల రుణం తీసుకుంది. బ్యాంకు నుండి తీసుకున్న రుణాలు చెల్లింపుల విషయంలో ముసద్దిలాల్ సంస్థ జాప్యం చేసింది. గతంలో ముసద్దిలాల్ జెమ్స్ అండ్ జువెల్లర్స్ ప్రైవేట్ లిమిటెడ్  కు చెందిన 130.57 కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేసింది.  గతంలో 82.11 కోట్ల విలువైన 145 కిలోల బంగారాన్నిఈడీ స్వాధీనం చేసుకుంది .