సంక్రాంతి వేళ హీరోయిన్ రష్మికకు ఐటీ అధికారుల షాక్

V6 Velugu Posted on Jan 16, 2020

సంక్రాంతి పండుగ వేళ హీరోయిన్ రష్మికకు ఐటీ అధికారులు షాక్ ఇచ్చారు. ఇటీవలే సరిలేరు నీకెవ్వరూ సినిమాతో హిట్ కొట్టిన రష్మిక ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. కర్ణాటకలోని కొడగు జిల్లా విరాజ్ పేట్‌లోని రష్మిక ఇంట్లో ఐటీ అధికారులు ఈ సోదాలు చేస్తున్నారు. దాదాపు 10 మందికి పైగా ఐటీ అధికారులు ఈ సోదాలలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. వారంతా రష్మిక ఆదాయ లెక్కలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం హైదారాబాద్‌లో ఉన్న రష్మిక.. ఓ తమిళ్ సినిమా షూటింగ్ నిమత్తం చైన్నై వెళ్తున్నారు. ఈ ఐటీ దాడుల గురించి తనకేం తెలియదని రష్మిక అంటున్నారు. కానీ, ఆమె మేనేజర్ మాత్రం ఈ దాడులను కన్ఫర్మ్ చేశారు. చలో సినిమాతో 2016లో సినీరంగంలోకి ప్రవేశించిన రష్మిక.. 2019 కల్లా స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఆమె సంపాదనకు, ఆమె కడుతున్న ఇన్‌కంటాక్స్‌కు పోలిక లేకపోవడంతో అధికారులు ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.

For More News..

ఎన్ఆర్సీపై తెలంగాణ డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు

బాత్రూంలో ఉన్న ఫొటోలతో మాజీ మిస్ ఇండియాకు వేధింపులు

Tagged Sarileru Neekevvaru, Rashmika Mandanna, Actoress Rashmika, chalo, Heroine Rashmika mandanna, IT search

Latest Videos

Subscribe Now

More News