బీబీసీ ఆఫీసుల్లో ఐటీ సోదాలు

బీబీసీ ఆఫీసుల్లో ఐటీ సోదాలు

ఢిల్లీలోని బీబీసీ ఆఫీసులో ఐటీ దాడులు జరిగాయి. సోదాల్లో అధికారులు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. బీబీసీ సిబ్బందికి సంబంధించిన సెల్ ఫోన్లు సైతం సీజ్ చేసి వారిని ఇళ్లకు పంపినట్లు తెలుస్తోంది. మరోవైపు ముంబైలోని కార్యాలయంలోనూ తనిఖీలు జరిగినట్లు సమాచారం. అయితే ఇవి సోదాలు కాదని, పన్నుల అవకతవకల ఆరోపణలకు సంబంధించి సర్వే మాత్రమేనని ఐటీ అధికారులు చెబుతున్నారు. 

2002 గుజరాత్ అల్లర్లకు సంబంధించి ఇండియా.. ది మోడీ క్వశ్చన్ పేరుతో బీబీసీ డాక్యుమెంటరీ రూపొందించడం పెను దుమారం రేపింది. ఈ వీడియోను కేంద్రం బ్యాన్ చేయగా.. యూట్యూబ్, ట్విట్టర్ లో దీనికి సంబంధించిన లింకులు బ్లాక్ చేసింది. మరోవైపు బీబీసీని సైతం బ్యాన్ చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు కాగా.. సర్వోన్నత న్యాయస్థానం దాన్ని కొట్టివేసింది. ఈ క్రమంలోనే బీబీసీ ఆఫీసులపై ఐటీ దాడులు జరగడం చర్చనీయాంశంగా మారింది.