హైదరాబాద్ లో ముగిసిన ఐటీ సోదాలు.. 7కోట్లు సీజ్

హైదరాబాద్ లో ముగిసిన ఐటీ సోదాలు.. 7కోట్లు సీజ్

హైదరాబాద్లో మూడు రోజులుగా జరుగుతున్న ఐటీ సోదాలు ముగిశాయి. నిన్న, మొన్న హైదరాబాద్ లోని ఏడు చోట్లు ఐటీ అధికారులు తనిఖీలు చేశారు. ఫార్మా కంపెనీ యజమాని ప్రదీప్ రెడ్డి, రియల్టర్ కోట్ల నరేందర్ రెడ్డి ఇళ్లలో 7 కోట్లు స్వాధీనం చేసుకున్నారు అధికారులు. తెలంగాణ ఎన్నికల కోసమే ఈ డబ్బును సమకూర్చినట్లు ఐటీ శాఖ అధికారులు తేల్చారు. ప్రదీప్ రెడ్డి.. మంత్రి సబితా ఇంద్రారెడ్డికి బంధువు. 

సోమవారం (నవంబర్13) నుంచి హైదరాబాద్ లో సోదాలు చేస్తున్నారు ఐటీ అధికారులు. సోమవారం తెల్లవారు జాము నుంచే నగరంలో ఏకకాలంలో ఫార్మా కంపెనీ యజమాని, అతని సిబ్బంది ఇండ్లలో తనిఖీలు నిర్వహించారు. గచ్చిబౌలిలోని మంత్రి సబితా ఇంద్రారెడ్డి బంధువు ప్రదీప్ రెడ్డి ఇంటితోపాటు, కంపెనీ డైరెక్టర్లు, సిబ్బంది ఇండ్లలో సోదాలు చేశారు.మూడు రోజులుగా వారి ఇండ్లలో సాగిన దాడుల ఇవాళ ముగిశాయి.