ఓయూ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్కు శంకుస్థాపన చేసిన మంత్రి సబితా

ఓయూ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్కు శంకుస్థాపన చేసిన మంత్రి సబితా

హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కు మంత్రి సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు. విద్యలో మార్పులు తీసుకొస్తూ, విద్యార్థుల సమస్యలను పరిష్కరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. కొద్ది రోజుల ముందే రూ.38 కోట్లతో హాస్టల్ బిల్డింగ్ కు శంకుస్థాపన చేశామని మంత్రి సబిత గుర్తుచేశారు. రూ.34 కోట్లతో అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ చేపట్టామని, 9 నెలలో అడ్మినిస్ట్రేటివ్ నిర్మాణం పూర్తి చేయాలని ఈ సందర్భంగా ఆమె అధికారులను ఆదేశించారు.

త్వరలో ఇంకో హాస్టల్ కడతాం

60ఏండ్ల కింద నిర్మించిన బిల్డింగ్ లో ప్రస్తుతం అడ్మినిస్ట్రేషన్ కొనసాగుతోందని ఓయూ వీసీ రవీంద్రన్ అన్నారు. కొత్త అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కట్టేందుకు సీఎం కేసిఆర్ అనుమతి ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఓయూలో చదువుకొని ఇక్కడే వైస్ ఛాన్సలర్ గా పనిచేయడం ఆనందంగా ఉందని అన్నారు. ఒకవైపు గర్ల్స్ హాస్టల్, మరోవైపు బాయ్స్ హాస్టల్  ఏర్పాటు చేసినందున అడ్మినిస్టేటివ్ బిల్డింగ్ విద్యార్థులందరికీ అందుబాటులో ఉండేందుకు మెయిన్ రోడ్డుకు దగ్గరలో కడుతున్నామని రవీంద్రన్ చెప్పారు త్వరలో ఇంకో హాస్టల్ నిర్మించడంతో పాటు బీ హాస్టల్, ఆర్ట్స్ కాలేజీనీ అభివృద్ది చేస్తామని ప్రకటించారు. ఆర్థిక , విద్యా శాఖ మంత్రుల సహకారంతో ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ది చెందుతుందని అందుకు వారికి కృతజ్ఞతలు చెప్పారు.