అతడికి బౌలింగ్ ఇవ్వకపోవడమే కొంపముంచింది

అతడికి బౌలింగ్ ఇవ్వకపోవడమే కొంపముంచింది

వాంఖడే: ఐపీఎల్ పద్నాలుగో సీజన్ ఆసక్తికరంగా సాగుతోంది. దాదాపు ప్రతి మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠను రేకెత్తిస్తోంది. గురువారం రాజస్థాన్ రాయల్స్‌‌తో ఢిల్లీ క్యాపిటల్స్ జరిగిన మ్యాచ్ ఇంట్రెస్టింగ్‌గా సాగింది. గెలవాల్సిన మ్యాచ్‌‌లో రాయల్స్ చేతిలో క్యాపిటల్స్ పరాజయం పాలైంది. వేలంలో ఖరీదైన ఆటగాడిగా నిలిచన క్రిస్ మోరిస్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. ఆఖరి ఓవర్లో రెండు సిక్సర్లు బాది రాజస్థాన్‌‌ను విజయ తీరాలకు చేర్చాడు. 

మోరిస్‌‌ను నిలువరించడానికి క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ యత్నించినప్పటికీ సఫలం కాలేదు. ఈ విషయంపై ఢిల్లీ కోచ్ రికీ పాంటింగ్ స్పందించాడు. సీనియర్ స్పిన్నర్ రవించంద్రన్ అశ్విన్‌‌ను తాము సరిగ్గా వినియోగించుకోలేదని పాంటింగ్ చెప్పాడు. అతడితో పూర్తి ఓవర్ల కోటా బౌలింగ్ చేయించకపోవడం తప్పిదమేనని, వేసిన మూడు ఓవర్లూ అశ్విన్ బాగా వేశాడని మెచ్చుకున్నాడు. అయితే చివర్లో అశ్విన్‌కు ఎందుకు బౌలింగ్ ఇవ్వలేదో టీమ్ మెంబర్స్‌‌ను కూర్చోబెట్టి కనుక్కుంటానని తెలిపాడు.