కిడ్నాప్ చేసి ఫార్మ్‌హౌజ్‌లో బందీ : రూంలో 20 కుక్కలు వదిలిన కిడ్నాపర్లు

కిడ్నాప్ చేసి ఫార్మ్‌హౌజ్‌లో బందీ : రూంలో 20 కుక్కలు వదిలిన కిడ్నాపర్లు

గత రెండు రోజుల క్రితం కిడ్నాప్ అయిన ఎమ్మార్పీఎస్ నాయకుడు నరేందర్ ను దాచిన ఫార్మ్ హౌజ్ ను పోలీసులు గుర్తించారు. కిడ్నాప్ అయిన రెండు రోజులకు జూలై 13న గాయాలతో నరేందర్ ఇంటికి చేరుకున్నారు. శంషాబాద్ ధర్మగిరిగుట్ట ఆలయానికి సమీపంలో ఓ ఫార్మ్ హౌజ్ లో నరేందర్ ను కిడ్నాపర్లు బంధించారని తెలుసుకున్నారు. గండిపేటలోని భూ వివాదమే కిడ్నాప్ కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఫార్మ్ హౌజ్ లో గుర్రాలు, కుక్కలను పెంచుతున్నారు. నరేందర్ ను ఉంచిన రూమ్ లో దుండగులు 20 కుక్కలను వదిలారు. ఆయనను దారుణంగా హింసించారు కిడ్నాపర్లు. కొట్టి చిత్రహింసలు పెట్టడంతో గాయాలపాలైన నరేందర్ ను ట్రీట్ మెంట్ కోసం ఎమ్ఐ జి హాస్పిటల్ తరలించారు నార్సింగ్ పోలీసులు. ఫార్మ్ హౌస్ కు చేరుకున్న పోలీసులు టెక్నీకల్ ఏవిడెన్స్ సేకరిస్తున్నారు. ఫార్మ్ హౌజ్ ఎవరిది అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసి  ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు.