న్యూఢిల్లీ: భారత రెజ్లర్ వినేశ్ ఫోగట్‌కు అంతర్జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ (ITA) షాక్ ఇచ్చింది. గతేడాది డిసెంబర్ 18న డోపింగ్ పరీక్ష కోసం అధికారులు ఆమెను సంప్రదించలేకపోవడంతో ఆ ఘటనను 'మిస్డ్ టెస్ట్'గా పరిగణిస్తూ వినేశ్‌కు నోటీసులు జారీ చేసింది. గత 12 నెలల కాలంలో వినేశ్‌కు ఇది మొదటి 'వేర్ అబౌట్స్ ఫెయిల్యూర్' అని స్పష్టం చేసింది.
ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ, యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ నిబంధనల ప్రకారం.. రిజిస్టర్డ్ టెస్టింగ్ పూల్ (ఆర్టీపీ)లో ఉన్న క్రీడాకారులు ప్రతి రోజూ గంట సమయం అందుబాటులో ఉంటామని తెలియజేయాలి. ఈ సమయంలో డోపింగ్ కంట్రోల్ ఆఫీసర్ (డీసీవో) వచ్చి పరీక్షలు చేయవచ్చు. డిసెంబర్ 18, 2025న వినేశ్ తన నివాసంలో లేకపోవడంతో అధికారులు పరీక్షను పూర్తి చేయలేకపోయారు.
