యాదాద్రి, వెలుగు: యాదాద్రి జిల్లాకు చెందిన అనాథ బాలికను ఇటలీ దంపతులు దత్తత తీసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. తల్లిదండ్రులు వదిలేసిన అనాథ బాలిక యాదాద్రి జిల్లాలోని బాలసదనంలో ఉంచారు. రేణుకగా పేరు పెట్టగా.. ప్రస్తుతం ఆరోతరగతి చదువుతోంది. కాగా.. ఇటలీకి చెందిన దంపతులు పౌల్, ఆండ్రియా ఎల్లికి పిల్లలు లేరు. దీంతో దత్తత తీసుకోవడానికి ‘కారా’ (సెంట్రల్అడాప్షన్రిసోర్స్అథారిటీ) వెబ్ సైట్లో దరఖాస్తు చేసే సమయంలో రేణుక ఫొటోను చూసి సుముఖత తెలిపారు.
దీంతో దంపతుల వివరాలను ఇక్కడి ఆఫీసర్లు సేకరించి దత్తతకు ఓకే చెప్పారు. సోమవారం యాదాద్రి కలెక్టరేట్‌కు ఇటలీ దంపతులు రాగా.. అడిషనల్కలెక్టర్భాస్కరరావు దత్తత ప్రక్రియ పూర్తి చేశారు. రేణుకను దత్తత ఇచ్చినప్పటికీ.. ఆమె బాగోగులను ఎప్పటికప్పుడు ఇటలీకి చెందిన సంస్థ ద్వారా తెలుసుకుంటామని అడిషనల్కలెక్టర్ తెలిపారు. జిల్లా సంక్షేమ అధికారి నరసింహరావు. యశోద, బీఆర్ బీ కో– ఆర్డినేటర్ అనంతలక్ష్మి ఉన్నారు.
