కరోనాకు ఇటలీ వ్యాక్సిన్

కరోనాకు ఇటలీ వ్యాక్సిన్

రోమ్: ఇప్పుడంటే అంతా అమెరికా గురించి మా ట్లాడుకుంటున్నాం గానీ, అంతకుముందు కరోనా అత్యంత తీవ్రంగా ఉన్న దేశం ఏదైనా ఉంది అంటే అది ఇటలీనే. జస్ట్ కొద్ది రోజుల్లోనే చైనాను దాటేసింది ఆ దేశం. కానీ, ఇప్పుడు ఆ దేశమే ఓ మందు కనిపెట్టింది. ఎలుకలపై టెస్ట్ చేసింది . సక్సెస్ అయింది. ఎలుకల్లోనే తయారు చేసిన ఆ యాంటీ బాడీలను, ఎలుకలపైనే ప్రయోగించి సక్సెస్ అయ్యారు అక్కడి సైంటిస్టులు. రోమ్ లోని తాకీస్ బయోటెక్  ఆ యాంటీబాడీలను తయారుచేసింది. అక్కడి స్పల్లాం జానీ హాస్పిటల్లో ఎలుకలపై దాన్ని టెస్ట్ చేశారు.  ఎలుకల్లో వైరస్ ను  అది చం పేసిందని చెప్పారు. మనుషుల్లోనూ అది సక్సెస్ అవుతుందని తాకీస్ సీఈవోలూయిజీ ఓరిసికియో చెప్పారు.సైంటిస్టులు ఎలుకల యాంటీ బాడీస్ నుంచి మొత్తం 5 వ్యాక్సిన్ క్యాండిడేట్లను ఎంపిక చేయగా, 2 ప్రభావవంతంగా పనిచేసినట్టు గుర్తించారు. ఆ యాంటీబాడీస్ స్పైక్ వైరస్ లపై పనిచేస్తాయి. వైరస్ కణాల్లో యాంటీబాడీలు మెరుగ్గా ఇంకేందుకు ఎలక్ట్రాపరేషన్ టెక్నిక్ ను వాడారు. దీంతో యాంటీబాడీలను ఇంజెక్షన్ రూపంలో ఇవ్వడం వల్ల ఊపిరితిత్తుల్లోనే నేరుగా మరిన్ని యాంటీబాడీలను ఉత్పత్తి చేయొచ్చని చెబుతున్నారు. రియితెరా అనేమరో కంపెనీ కూడా కరోనా వైరస్ వ్యాక్సిన్ ను  తయారుచేసింది.