ఆలేరు(యాదాద్రి), వెలుగు : బైక్‌ను కారు ఢీకొని లెక్చరర్ మృతి చెందిన ఘటన యాదాద్రి జిల్లా ఆలేరులో గురువారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జనగామకు చెందిన సుంకరనేని శ్రీనాథ్ (36)ఆలేరులోని ఐటీఐ లెక్చరర్‌గా పని చేస్తూ స్థానికంగా సిల్క్ నగర్లో నివాసం ఉంటున్నాడు. బైక్‌పై బయటకు వెళ్లిన శ్రీనాథ్ బుధవారం రాత్రి పది గంటల తర్వాత తిరిగి ఇంటికి వస్తున్నాడు.
రఘునాథపురం ఆరోవోబీ నుంచి కిందకు వెళ్తున్న సమయంలో కర్ణాటకకు చెందిన కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో శ్రీనాథ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన చూసిన స్థానికులు కారును వెంబడించి పట్టుకొని పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు డ్రైవర్ సిద్ధారంను అదుపులోకి తీసుకున్నారు. మృతుడి భార్య మంగమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
