
‘లవ్‌టుడే’ బ్యూటీ ఇవానా ఒక్క సినిమాతోనే తెలుగులో మంచి క్రేజ్ సంపాదించుకుంది. తాజాగా మరో సినిమాతో ఈ అమ్మడు ప్రేక్షకుల ముందుకు రానుంది. క్రికెటర్ ధోనీ సొంత బ్యానర్లో వస్తున్న ‘ఎల్జీఎం’ సినిమాలో ఇవానా హీరోయిన్గా నటించింది.
ఈ సినిమా వచ్చే నెల (ఆగస్టు 4న) విడుదల కానుంది. లవ్‌టుడే సినిమా తర్వాత ఈ బ్యూటీ తెలుగులో ‘సెల్ఫిష్’ అనే సినిమాలో నటించింది. ఇప్పటికే తమిళ, మలయాళ భాషల్లోనూ ఈ నటికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దీంతో ఎల్జీఎం సినిమాలోనూ ఇవానానే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారనున్నట్టు తెలుస్తోంది.
చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చి హీరోయిన్ రేంజ్‌కి ఎదిగిన ఇవానా.. ఇప్పుడు వరుస ఆఫర్లు అందుకుంటోంది. ఇక యూత్‌లో అయితే ఈ నటికున్న ఫాలోయింగ్ చెప్పక్కర్లేదు. మరి ఈ సినిమా ఆమె కెరీర్‌కు ఏ విధంగా హెల్ప్ అవుతుందో వేచి చూడాలి.