
జబర్దస్త్ కమెడియన్ అరెస్ట్ అయ్యాడు. ప్రేమ పేరుతో ఓ యువతిని మోసం చేసి..పెళ్లి చేసుకుంటానని నమ్మబలికిన నవ సందీప్ను మధురానగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే..
ప్రముఖ ఛానల్లో ప్రసారమయ్యే జబర్దస్త్‌లో నటుడు నవసందీప్ యాక్ట్ చేస్తున్నాడు. అయితే అతను 2018లో ఓ యువతితో (28) పరిచయం చేసుకున్నాడు. ఆమెతో వాట్సాప్ చాటింగ్ చేస్తూ దగ్గరయ్యాడు. ప్రేమిస్తున్నానంటూ నమ్మబలికాడు. ఆ యువతిని ఊరి నుంచి హైదరాబాద్‌కు రప్పించాడు. ప్రస్తుతం బాధితురాలు షేక్‌పేటలోని అల్ హమారా కాలనీలోని ఓ హాస్టల్లో నాలుగేళ్లుగా ఉంటోంది. ఈ క్రమంలో సందీప్ ఆ యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరంగా వాడుకున్నాడు. ఆ తర్వాత పెళ్లి ఎప్పుడు చేసుకుంటావని బాధితురాలు ప్రశ్నించడంతో నిరాకరించాడు.
పెళ్లి పేరు ఎత్తేసరికి యువతికి నవసందీప్ షాకిచ్చాడు. తాను వేరే యువతిని పెళ్లి చేసుకుంటున్నానని చెప్పడంతో యువతి ఒక్కసారిగా షాక్ కు గురైంది. తాను మోసపోయానని గ్రహించిన బాధితురాలు ..పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు...నిందితుడు నవసందీప్‌ను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు.