‘చేర్యాల రెవెన్యూ డివిజన్’పై బీఆర్ఎస్ వైఖరి ఏంటి?

‘చేర్యాల రెవెన్యూ డివిజన్’పై బీఆర్ఎస్ వైఖరి ఏంటి?

చేర్యాల, వెలుగు : చేర్యాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటుపై బీఆర్ఎస్ నేతల వైఖరి ఏమిటో ప్రజలకు తెలపాలని జనగామ నియోజకవర్గ జేఏసీ నాయకుడు అందె అశోక్ డిమాండ్​ చేశారు. మంగళవారం చేర్యాల మండలంలోని రాంపూర్ గ్రామ శాఖ సమావేశాన్ని మాజీ సర్పంచ్ రంగు శివశంకర్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా అందే అశోక్, మండల కన్వీనర్ బొమ్మగాని అంజయ్య గౌడ్ మాట్లాడారు. చేర్యాల ప్రాంతం ముక్కలుగా విడిపోయి ఈ ప్రాంత ప్రజలు అనేక ఇబ్బందులు పడుతుంటే బీఆర్ఎస్ నాయకులు రెవెన్యూ డివిజన్ విషయంలో నోరు మెదపకపోవడం సరికాదన్నారు. రాజకీయాలకు అతీతంగా రెవెన్యూ డివిజన్ సాధనకు ఉద్యమించాలని పిలుపునిచ్చారు.

జేఏసీ రంపూర్ గ్రామ కమిటీ ఎన్నిక..

జేఏసీ రంపూర్ గ్రామ కమిటీని ఎన్నుకున్నారు.  కన్వీనర్ గా రంగు రాజమౌళి, కో కన్వీనర్లుగా నిమ్మ లక్ష్మారెడ్డి, బండారి సిద్ధయ్య, బండారి నర్సయ్య ఎన్నికయ్యారు.  కార్యదర్శిగా మలిపెద్ది రవీందర్, సహాయ కార్యదర్శిగా నిమ్మ మహేందర్ రెడ్డి, బండారి మల్లయ్య, రంగు సుభాష్, ప్రతినిధులుగా శెట్టె మల్లయ్య, మంతెన హనుమారెడ్డి, రంగు రాజు, ఆర్. అంజయ్యను ఎన్నుకున్నారు.