గేమ్ ఛేంజర్ గా మారిన మై బ్యాంక్

గేమ్ ఛేంజర్ గా మారిన మై బ్యాంక్

ఒక ఆర్థిక వ్యవస్థ ఎదగాలంటే… చిన్న వ్యాపారాలే వెన్నెముక. వీటికి రుణాలిచ్చే విషయంలో చైనాలో జాక్‌‌మాకు చెందిన ఆన్‌‌లైన్ బ్యాంక్ ఒక విప్లవాత్మకం అని చెప్పొచ్చు. జాక్‌‌మాకు చెందిన మైబ్యాంక్ సుమారు కోటిన్నర చిన్న కంపెనీలకు 290 బిలియన్ డాలర్లను అంటే రూ.19,96,940 కోట్లను కేవలం నాలుగేళ్లలోనే అందించడం విశేషం. జాక్‌‌మా బ్యాంక్‌‌కు రుణం అప్లయ్ చేసుకోవడం కూడా చాలా తేలిక. స్మార్ట్‌‌ఫోన్ ఉంటే చాలు క్షణాల్లో అయిపోతాది. అప్రూవ్ అయిన వెంటనే క్యాష్ కూడా చేతిలోకి వచ్చేస్తుంది.   ఈ మొత్తం ప్రాసెస్‌‌కు సుమారు మూడు నిమిషాల సమయం పడుతుంది అంతే. బ్యాంకర్లు కూడా మధ్యలో ఎవరూ ఉండరు. మొత్తం ఆన్‌‌లైన్‌‌లోనే. ఈ రుణాల డిఫాల్ట్ రేటు కేవలం 1 శాతం ఉందటే జాక్‌‌మా మైబ్యాంక్ ఎంత సక్సెస్ అయిందో చూడండి . ఫైనాన్సియల్ టెక్నాలజీ బూమ్.. ఎలక్ట్రానిక్ పేమెంట్స్‌‌కు చైనాను ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్‌‌గా చేసింది. దీని ద్వారానే కంపెనీలతో బ్యాంక్‌‌లు ఇంటరాక్ట్ అయ్యే పక్రియ మారిపోయింది.  చాలా దేశాల ఆర్థిక వృద్ధికి ఇది కీలకంగా అవతరించింది.

మైబ్యాంక్, దాని ప్రత్యర్థి సంస్థలు పేమెంట్స్ సిస్టమ్స్, సోషల్ మీడియా, ఇతర సోర్సస్ నుంచే వచ్చే బల్క్ డేటాను తీసుకుంటూ ఎప్పడికప్పుడూ విశ్లేషిస్తూ.. క్షణాల్లో రుణాలిస్తున్నారు. చిన్న రుణ గ్రహీతలతోనే తాము చాలా కంఫర్టబుల్‌‌గా ఉన్నామని ఈ కంపెనీలు కూడా చెబుతున్నాయి.చిన్నవ్యాపారాలు అక్కడ 60 శాతం వృద్ధిని, 80 శాతం వర్కర్లకు ఉద్యోగాలను అందిస్తున్నాయి. ఆర్థిక వ్యవస్థకు చిన్న,మధ్య తరహా వ్యాపారాలు నిజంగా చాలా వెన్నుదన్నుగా ఉంటున్నాయని హాంకాంగ్‌‌లోని ఎర్నస్ట్ అండ్ యంగ్ ఎల్‌‌ఎల్‌‌పీ క్యాపిటల్ మార్కెట్స్ అండ్ బ్యాంకింగ్ సీనియర్ పార్టనర్ కేథ్ పాగ్సన్ చెప్పారు. రుణాలిచ్చేందుకు బిగ్‌‌ డేటా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి టెక్నాలజీలను వాడుతూ.. చైనా ప్రపంచంలోనే లీడర్‌‌‌‌గా అవతరించిందని కన్సల్టింగ్ సంస్థ ఆలివర్ వైమన్ గ్రేటర్‌‌‌‌ చైనా ఫైనాన్సియల్ సర్వీసెస్ కో హెడ్ క్లిఫ్ షెంగ్ అన్నారు. తమ లీగల్ ఫ్రేమ్‌‌వర్క్,రెగ్యులేటరీ ఎన్విరాన్‌‌మెంట్.. తేలికగా పెద్ద మొత్తంలో డేటాను జనరేట్ చేసేందుకు ఉపయోగపడుతున్నాయని చెప్పారు.  మైబ్యాంక్ లోన్ అప్రూవల్ రేటు మిగతా ట్రెడిషనల్ లెండర్లతో పోలిస్తే.. నాలుగు రెట్లు ఎక్కువగా ఉందని మైబ్యాంక్ ప్రెసిడెంట్ జిన్ షియాలాంగ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

ఒక్కో రుణం ఇచ్చినందుకు ఈ సంస్థకు 3 యువాన్లు(రూ.30) ఖర్చయితే.. ప్రత్యర్థ సంస్థలకు 2వేల యువాన్లు(రూ.20 వేలు) అవుతున్నాయి. చిన్న వ్యాపారాలకు రుణాలివ్వడానికి టెక్నాలజీని వాడుకుంటున్న ఒకే ఒక్క లెండర్‌‌‌‌గా మైబ్యాంక్ నిలిచింది. టెన్సెంట్ హోల్డింగ్స్ లిమిటెడ్, పింక్ యాన్ ఇన్సూరెన్స్ గ్రూప్ కో లాంటి యూనిట్లు కూడా జాక్‌‌మా బ్యాంక్‌‌ ఇలాంటి ఆఫర్లనే ప్రస్తుతం ఇస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వ రంగానికి చెందిన చైనా కన్‌‌స్ట్రక్షన్ బ్యాంక్ కార్పొ కూడా ఈ స్పేస్‌‌లోకి వచ్చేందుకు చూస్తోంది. ఈ దేశీయ రెండో అతిపెద్ద లెండర్‌‌‌‌ కూడా గత సెప్టెంబర్‌‌‌‌లో మొబైల్ యాప్‌‌ను లాంచ్ చేసింది. రెండు నిమిషాల్లో 5 యువాన్లకు(రూ.50) లోన్ అప్లికేషన్లను ప్రాసెస్‌‌ చేసే ప్రక్రియను ప్రారంభించింది.  కన్‌‌స్ట్రక్షన్ బ్యాంక్ కూడా చిన్నవ్యాపారాలకు తన లెండింగ్‌‌ను గతేడాది 51 శాతం పెంచింది. గతంలో తమ మొండి బకాయిల రేషియో 8 శాతంగా ఉండటంతో బాగా నష్టాలు వచ్చేవని, ప్రస్తుతం మళ్లీ తాము పునర్‌‌‌‌ వైభవం తెచ్చుకున్నామని కన్‌‌స్ట్రక్షన్ బ్యాంక్ చెప్పింది.