
కూకట్పల్లి, వెలుగు: వాకింగ్ కు వెళ్లిన మహిళ మెడలోని చైన్ ను ఓ అగంతకుడు లాక్కెళ్లాడు. కేపీహెచ్ బీ పోలీసులు తెలిపిన ప్రకారం.. హైదర్‌నగర్ పరిధి మైత్రి హిల్స్‌లో ఉండే శైలజ(42) మియాపూర్ మెట్రో డిపో సమీపంలోని వాకింగ్ ట్రాక్‌లో వాకింగ్‌కు వెళ్తుంది. రోజూ మాదిరిగానే సోమవారం ఉదయం ఆరున్నర గంటల సమయంలో ఆమె వాకింగ్ చేస్తుండగా వెనక నుంచి బైక్‌పై వచ్చిన దుండగుడు శైలజ మెడలోని 5 తులాల గోల్డ్ చైన్ ను లాక్కొని పారిపోయాడు. బాధితురాలు కంప్లయింట్ చేయగా కేసు నమోదు చేసినట్టు కేపీహెచ్ బీ పోలీసులు తెలిపారు.