
జగదీష్ ఆమంచి హీరోగా నటిస్తూ, దర్శక నిర్మాతగా రూపొందించిన చిత్రం ‘యముడు’.మైథలాజికల్, సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ సినిమాకి ‘ధర్మో రక్షతి రక్షిత:’ అనేది ట్యాగ్ లైన్. శ్రావణి శెట్టి హీరోయిన్. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ రిలీజ్ చేయగా, సోమవారం ఆడియో లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరైన నిర్మాత బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ ‘చిన్న చిత్రాలు ఈ మధ్య వండర్లు క్రియేట్ చేస్తున్నాయి. అలా ఈ ‘యముడు’పెద్ద విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది’అని చెప్పారు.
జగదీష్ ఆమంచి మాట్లాడుతూ ‘ప్రస్తుతం ఎక్కడ చూసినా కుట్రలు, హత్యలు, అక్రమ సంబంధాలకు సంబంధించిన వార్తలే కనిపిస్తున్నాయి. ఆ పాయింట్‌లతోనే ఈ చిత్రాన్ని తీశాం’అని అన్నాడు. అందరికీ కనెక్ట్ అయ్యేలా ఈ చిత్రం ఉంటుందని శ్రావణి శెట్టి చెప్పింది. నటులు ఆకాష్, భవానీ రాకేష్, స్క్రీన్ ప్లే రైటర్ శివ, కెమెరామెన్ విష్ణు పాల్గొన్నారు.