
జీడిమెట్ల: హైదరాబాద్ లో డీజే వెహికల్ సిస్టమ్‌ను వదిలిపెట్టేందుకు లంచం తీసుకుంటూ ఎస్ఐ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఇటీవల జగద్గిరిగుట్టకు చెందిన ఓ వ్యక్తి వెహికల్ పై డీజే సిస్టమ్తీసుకెళ్తుండగా పోలీసులు పట్టుకుని సీజ్‌చేశారు. కాగా, వదిలిపెట్టేందుకు జగద్గిరిగుట్ట ఎస్ఐ శంకర్ రూ.15వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ ఆఫీసర్లకు ఫిర్యాదు చేశాడు.
శనివారం మధ్యాహ్నం మధ్యవర్తి నాగేందర్ నుంచి ఎస్ఐ శంకర్ రూ.15వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ ఆఫీసర్లు రైడ్ చేసి రెడ్‌హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఎస్ ఐని అదుపులోకి తీసుకుని నాంపల్లి కోర్టులో హాజరుపరిచినట్టు ఏసీబీ ఆఫీసర్లు తెలిపారు. ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం అడిగితే 9440446106 కు వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయాలని ఏసీబీ ఆఫీసర్లు సూచించారు.