గ్యాస్ లీకేజీతో చెలరేగిన మంటలు.. జగద్గిరిగుట్ట ఓ ఇంట్లో ఘటన

గ్యాస్ లీకేజీతో  చెలరేగిన మంటలు.. జగద్గిరిగుట్ట ఓ ఇంట్లో ఘటన

జీడిమెట్ల, వెలుగు: ఓ ఇంట్లో గ్యాస్​ లీకేజీ జరిగి మంటలు చెలరేగాయి. జగద్గిరిగుట్ట ఉషోదయకాలనీ వినాయకనగర్​ రెసెడిన్సీలో సునీత, ప్రశాంత్​దంపతులు నివాసముంటారు. బుధవారం సాయంత్రం సునీత ఇంట్లో వంటచేస్తుండగా బయట ఉంచిన సిలిండర్​ పైప్​ ఊడిపోయి గ్యాస్​ లీకేజీ అయింది. దీంతో మంటలు అంటుకున్నాయి. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకుని మంటలను ఆర్పివేసి గ్యాస్​ లీకేజీని కంట్రోల్​ చేశారు. సిలిండర్​ రూం బయట ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. కొన్ని వస్తువులు కాలిపోయాయి.