
ఆదిలాబాద్ అర్బన్, వెలుగు: అభిమాన నేత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కాంక్షిస్తూ ఆదిలాబాద్ పట్టణానికి చెందిన బెజ్జంకి అనిల్‍కుమార్ పదేళ్లుగా చేపట్టిన దీక్ష ఎట్టకేలకు ఫలించింది. వైఎస్ఆర్ చనిపోయిన తర్వాత జగన్మోహన్‍రెడ్డిని సీఎం కావాలని కోరుతూ 2009లో అనిల్ ఆదిలాబాద్ నుంచి బాసర అమ్మవారి ఆలయం వరకు చెప్పులు లేకుండా పాదయాత్ర నిర్వహించాడు. కానీ అప్పట్లో ఆయన కల నెరవేరలేదు. దీంతో జగన్ సీఎం అయ్యేంతవరకు తాను చెప్పులు ధరించనని 2009లో ప్రతిన బూనాడు. ఈ నెల 30న జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనుండటంతో అదే రోజు తాను చెప్పులు ధరిస్తానని తెలిపారు.