
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. పెన్షన్ల పెంపు ఫైల్ పై తొలి సంతకం చేశారు. పరిపాలనలో ఆయన మార్క్ కూడా అప్పుడే మొదలైంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయంలోని అధికారులపై బదిలీ వేటుపడింది.
సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు సతీష్ చంద్ర, జి.సాయి ప్రసాద్, గిరిజా శంకర్, ఎ.రాజమౌళిలను బదిలీ చేస్తూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆదేశాలు జారీచేశారు. వెంటనే సాధారణ పరిపాలన శాఖ(జీఏడీ) లో రిపోర్ట్ చేయాలని ఆ అధికారులకు సూచించారు.
ముఖ్యమంత్రి జగన్ అదనపు కార్యదర్శిగా ధనుంజయ రెడ్డి నియమితులయ్యారు.