
లెలిజాల రవీందర్ హీరోగా నటిస్తూ దర్శకనిర్మాతగా తెరకెక్కించిన చిత్రం ‘రాజు గాని సవాల్’. రితికా చక్రవర్తి హీరోయిన్. ఈ మూవీ టీజర్‌ను నటుడు జగపతిబాబు విడుదల చేసి బెస్ట్ విషెస్ చెప్పారు.
అనంతరం జరిగిన ప్రెస్‌మీట్‌లో రవీందర్ మాట్లాడుతూ ‘హైదరాబాద్ కల్చర్‌ను చూపిస్తూ, తెలంగాణలో ఫ్యామిలీ బాండింగ్, ముఖ్యంగా అన్నాచెల్లెలు అనుబంధాన్ని ఇందులో ఆవిష్కరించబోతున్నాం. రియల్ లొకేషన్స్‌లో చిత్రీకరించాం.
ఎంటర్ టైన్ మెంట్‌తో పాటు మంచి ఎమోషనల్ డ్రామా ఉంటుంది’ అని చెప్పాడు. ఈ సినిమాను విడుదల చేస్తున్న బాపిరాజు మాట్లాడుతూ ‘ఇప్పటిదాకా సిస్టర్ సెంటిమెంట్‌తో వచ్చిన సినిమాల బాటలో ఈ చిత్రం కూడా మెప్పిస్తుందనే నమ్మకముంది. రాఖీ పండుగ సందర్భంగా ఆగస్టు 8న విడుదల చేస్తున్నాం’ అని తెలియజేశారు. హీరోయిన్ రితికా చక్రవర్తితో పాటు టీమ్ పాల్గొన్నారు.