టాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ జగపతి బాబు మరోసారి బుల్లితెరపై ఎంట్రీ ఇవ్వబోతున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా సినిమాల్లో బిజీగా ఉన్నప్పటికీ మరోసారి టీవీ స్క్రీన్‌పైకి రాబోతున్నాడు. ఒక చానెల్ రూపొందించనున్న నాన్–ఫిక్షన్ ఎంటర్‌టైన్‌మెంట్ షోను జగ్గూభాయ్ హోస్ట్ చేయబోతున్నాడు. గతంలో ఆయన ఈటీవీలో వచ్చిన ‘రాజు రాణి’తోపాటు, ‘కో అంటే కోటి’ అనే మరో షో హోస్ట్‌గా చేశాడు. దాదాపు పదేళ్ల తర్వాత ఆయన టీవీలోకి రీఎంట్రీ ఇస్తున్నారు. ఇది సెలబ్రిటీ గేమ్ షో అయ్యుండే ఛాన్సుంది. సినిమా, టీవీ రంగాలకు చెందిన సెలబ్రిటీలతో ఈ షో నడుస్తుంది. ఇప్పటికే కొత్త ‘షో’కు సంబంధించిన ప్రోమో షూట్‌లో జగపతి బాబు పాల్గొన్నట్లు సమాచారం. ఈ నెల 12న జగ్గూభాయ్ పుట్టిన రోజు సందర్భంగా టీవీ షో ఫస్ట్‌లుక్ రావొచ్చు.
