
ఒక సినిమాకి ఒకే విలన్ ఉండేవాడు ఒకప్పుడు. ఇప్పుడు ట్రెండ్ మారింది. ఎంతమంది విలన్స్ ఉంటే యాక్షన్ ఆ రేంజ్‌లో ఉంటోంది. అందుకే బన్నీ కోసం ముగ్గురు విలన్స్‌ని దింపే ప్రయత్నం జరుగుతోంది. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న మూడో చిత్రానికి భారీ తారాగణాన్ని ఎంపిక చేస్తున్నాడు సుకుమార్. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందనున్న ఈ మూవీలో ముగ్గురు విలక్షణ నటులు విలన్లుగా నటిస్తున్నారు. ‘నాన్నకు ప్రేమతో’లో మోడ్రన్ విలన్‌గా… ‘రంగస్థలం’లో పక్కా పల్లెటూరి విలన్‌గా జగపతిబాబును చూపించిన సుకుమార్ ఈ సినిమాలో చిత్తూరు వాసిగా సరికొత్త విలనిజం చూపించనున్నాడట. ‘ఇస్మార్ట్ శంకర్’లో విలన్‌గా ఆకట్టుకున్న దీపక్ శెట్టి మరో విలన్ పాత్ర పోషిస్తున్నాడు. అలాగే ఫారెస్ట్ ఆఫీసర్‌గా విజయ్ సేతుపతి కూడా నెగిటివ్ పాత్రలోనే నటిస్తున్నాడట. ఈ విషయాన్ని దీపక్ శెట్టి ఖరారు చేశాడు. ఇది పక్కా కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్ అని.. ఒక నెలలో సెట్స్ పైకి వెళ్లనుందని చెప్పాడు. బన్నీకి జోడీగా రష్మిక మందాన్న హీరోయిన్గా నటించనున్న ఈ మూవీని మైత్రీమూవీ మేకర్స్ నిర్మించనున్నారు. సుకుమార్ చిత్రాలకు సంగీతం అందించే దేవీశ్రీనే ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్లో చర్చంతా ఈముగ్గురి కాంబోలో తెరకెక్కుతున్న సినిమాగురించే.