- పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
హైదరాబాద్, వెలుగు: గాంధీ కుటుంబ సిద్ధాంతాన్ని కాంగ్రెస్ కార్యకర్తలుగా నిరంతరం అనుసరిస్తూనే ఉంటామని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి స్పష్టం చేశారు. శనివారం గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నాయకత్వంలో గాంధీ ఆదర్శాలను నిబద్ధత కలిగిన కాంగ్రెస్ కార్యకర్తలుగా తాము ముందుకు తీసుకెళ్తామని చెప్పారు.
దేశ చరిత్రలో గాంధీ, నెహ్రూ కుటుంబాలు ఉండొద్దనేని మోదీ ప్లాన్ అని ఆరోపించారు. అందుకే మోదీ నిత్యం నెహ్రూ కుటుంబాన్ని కించపరచడమే ఎజెండాగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. గత 11 ఏండ్లలో ప్రధానిగా మోదీ దేశానికి చేసింది ఏమిటని ఆయన ప్రశ్నించారు. అయోధ్యలో రామాలయం కట్టామని చెప్పడం తప్ప, బీజేపీ సాధించింది ఏమిటని జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు.
