బంగారం ధర తగ్గాలంటే రాహుల్ ప్రధాని కావాలి: జగ్గారెడ్డి వెల్లడి

బంగారం ధర తగ్గాలంటే రాహుల్ ప్రధాని కావాలి: జగ్గారెడ్డి వెల్లడి

హైదరాబాద్, వెలుగు:  దేశంలో బంగారం ధర తగ్గాలంటే రాహుల్ గాంధీ ప్రధాని కావాలని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. బుధవారం గాంధీ భవన్ లో ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు తులం బంగారం రూ. 28 వేలు ఉండేదని, మోదీ ప్రధాని అయ్యాక అది రూ. 76 వేలకు పెరిగిందన్నారు. బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుటుంబాలు తులం బంగారం 28 వేల చొప్పున కొన్నది నిజం కాదా అని ప్రశ్నించారు.

దీనిపై తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలన్నారు. రాహుల్ గాంధీ కుటుంబం త్యాగం ముందు మోదీ, అమిత్ షాలు జీరోలని విమర్శిచారు. అదానీ, అంబానీలతో కాంగ్రెస్ కు డీల్ కుదరడం ఏమిటని, మోదీ ఏం మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. పీవీ నర్సింహారావును సీఎంను, పీఎంను కాంగ్రెస్ చేసినప్పుడు మోదీ , బీజేపీ ఎక్కడుందని ప్రశ్నించారు.