ఒక్క సీటు కోసం ఇంతగా దిగజారాలా?..బీజేపీ తీరుపై కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి ఫైర్

ఒక్క సీటు కోసం ఇంతగా దిగజారాలా?..బీజేపీ తీరుపై కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి ఫైర్
  •  సాదాసీదా మహిళను రాజ్యసభలో అడుగుపెట్టకుండా అడ్డుకోవడం ఏం సంస్కారం

హైదరాబాద్, వెలుగు: ఒక్క రాజ్యసభ సీటు కోసం ప్రధాని మోదీ, బీజేపీ నేతలు ఇంతగా దిగజారడం అవసరమా? అని కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి ప్రశ్నించారు. పక్కా గాంధేయవాది, సాదాసీదా మహిళ మీనాక్షి నటరాజన్ రాజ్యసభలో అడుగుపెడితే అభినందించాల్సిందిపోయి.. అడ్డుకోవడం బీజేపీ సంస్కారమా అని ఫైర్ అయ్యారు. గురువారం ఆయన గాంధీ భవన్‌‌‌‌‌‌‌‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు.

ఇంతటి నీతిమాలిన చర్యను బీఆర్ఎస్ ఎందుకు ప్రశ్నించడం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌కు దక్కే రాజ్యసభ సీటును బీజేపీ దొంగతనం చేస్తే.. ఖండించాల్సిన బీఆర్ఎస్, కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌పైనే బురదజల్లే ప్రయత్నం చేయడం దిగజారిన రాజకీయాలకు పరాకాష్ట అని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌లో కోవర్టులు ఉంటే తోడ్కలు తీస్తాం.. అది వేరే విషయం, కానీ బీజేపీ చేసిన నీతిమాలిన చర్యను ఆ పార్టీ నేతలు కప్పిపుచ్చుకునేందుకు ‘కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌లో కోవర్టులు’ అనే అంశాన్ని తెరపైకి తేవడం సిగ్గుచేటన్నారు.