Venkatesh: 'నేనే మ్యాన్ ఆఫ్ ది హౌస్'... ‘ఆదర్శ కుటుంబం’ నుంచి చిట్టిబాబు గ్లింప్స్ రిలీజ్!

Venkatesh: 'నేనే మ్యాన్ ఆఫ్ ది హౌస్'... ‘ఆదర్శ కుటుంబం’ నుంచి చిట్టిబాబు గ్లింప్స్ రిలీజ్!

విక్టరీ వెంకటేశ్ , మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ 'ఆదర్శ కుటుంబం: హౌస్ నెం.47 (AK47)'.  ఇప్పటికే ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.  గాంధీ జయంతి సందర్భంగా ఈ చిత్రం  అక్టోబర్ 2, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. లేటెస్ట్ గాఈ మూవీ నుంచి వెంకీ మామ క్యారెక్టర్ ను తెలియజేస్తూ 'చిట్టిబాబు' గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ఈ వీడియో గ్లింప్స్ విశేషంగా ఆకట్టుకుంటోంది.

నేనే మ్యాన్ ఆఫ్ ది హౌస్...

గ్లింప్స్ ప్రారంభంలో శ్రీనిధి శెట్టి పోషిస్తున్న స్వర్ణ పాత్ర ఇంటిని చూపిస్తూ.. 'చిట్టిబాబు వంట కూడా చేస్తాడు... ఇంటి పనులన్నీ చూసుకుంటాడు' అంటూ సరదాగా ఆటపట్టించడం ఆసక్తిని పెంచుతుంది. 'నేనే మ్యాన్ ఆఫ్ ది హౌస్'అని వెంకటేశ్ చెప్పే డైలాగ్‌తో పాటు ఆయన అమాయకమైన హావభావాలు, టైమింగ్, కామెడీ ప్రేక్షకులను నవ్విస్తాయి.'నాకు ఎవరూ పని చేయడం నచ్చదు... అందుకే అన్నీ నేనే చూసుకుంటాను' అనే డైలాగ్ చిట్టిబాబు పాత్ర స్వభావాన్ని చక్కగా పరిచయం చేస్తుంది. చివర్లో నారా రోహిత్ ఎంట్రీ ఇచ్చి 'ఇదే ఆదర్శ కుటుంబం' అంటూ చెప్పే డైలాగ్ గ్లింప్స్‌కు మరింత హైప్ తీసుకొచ్చింది.

ఈ చిత్రంలో కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా.. నారా రోహిత్ కీలక పాత్రలో కనిపించనున్నారు. అలాగే నివేదా పేతురాజ్, యువినా, రాజ్ ప్రజ్వల్, రావు రమేష్, సత్య, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, రఘుబాబు, ఉదయ్‌బీర్ సంధు తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై సూర్యదేవర రాధాకృష్ణ , వంశీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు.

ALSO READ : సీఎం సినిమాకు షాక్.. ‘జన నాయగన్’ షోలని మధ్యలోనే ఆపేసిన పోలీసులు

భారీ అంచనాలతో రెడీ..

త్రివిక్రమ్ మార్క్ కుటుంబ విలువలు, హాస్యం, భావోద్వేగాలతో పాటు యాక్షన్ టచ్ కూడా ఈ చిత్రంలో ఉండబోతున్నట్లు గ్లింప్స్ స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. ముఖ్యంగా వెంకటేశ్‌ను మరోసారి పూర్తి స్థాయి ఫ్యామిలీ హీరోగా, వినోదభరితమైన పాత్రలో చూడబోతున్నామనే ఆనందంలో అభిమానులు ఉన్నారు. ఇప్పటికే విడుదలైన ప్రతి ప్రమోషనల్ కంటెంట్‌కు మంచి స్పందన రావడంతో 'ఆదర్శ కుటుంబం: హౌస్ నెం.47' దసరా సీజన్‌లో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేస్తుందని మేకర్స్ ధీమాగా ఉన్నారు.