మీ అయ్య చారాణా.. నువ్వు బారాణా

మీ అయ్య చారాణా.. నువ్వు బారాణా
  •  కేటీఆర్ చీప్ లిక్కర్ తాగినోని లెక్క మాట్లాడుతుండు

  • టీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి 


హైదరాబాద్: మాజీ మంత్రి కేటీఆర్ చీప్ లిక్కర్ తాగినోడి లాగా మాట్లాడుతున్నాడని టీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. రాజీవ్ గాంధీ విగ్రహం కూలగొడతామంటే మేం చూస్తు ఊరుకుంటామా? అంటూ స్ట్రాంగ్ వార్నింగ్​ఇచ్చారు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు కరెక్ట్ మొగుడు, ధగడు, మిండేడు రేవంత్ రెడ్డి అని అన్నారు. 

జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ  ‘కేటీఆర్.. కల్లు తాగిన కోతిలెక్క దుంకులాడుతున్నాడు. నువ్వు పొలిటికల్ కోచింగ్ సెంటర్ లో ట్రైనింగ్ తీసుకుంటే బెటర్. రాజీవ్ గాంధీ దేశ ప్రజల కోసం బలిదానం అయ్యారు. మిలిటెంట్లు కాల్చి చంపింది నిజమే కదా ? రాజీవ్ గాంధీ విగ్రహం సెక్రటేరియట్ ముందు తీసేస్తం అంటావా? మీ అయ్య కేసీఆర్ చారాణా చేస్తే, నువ్వు బారాణా చెప్తావు. మీరు పొలిటికల్ గా పవర్ లోకి రారు. మేం సోనియా గాంధీ..రాహూల్ గాంధీల కు నీతిగా గులాం చేస్తాం.. మీ లెక్క కన్నింగ్ కాదు’ అని అన్నారు.