నేను ఏ పార్టీలోకి వెళ్లను..అవసరమైతే పార్టీ పెడతా: జగ్గారెడ్డి

 నేను ఏ పార్టీలోకి వెళ్లను..అవసరమైతే పార్టీ పెడతా: జగ్గారెడ్డి

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డిల జాగీరు కాదన్నారు.  ఉత్తమ్ కుమార్ రెడ్డి చెబితే తాను ఎందుకు మాట్లాడతానని ప్రశ్నించారు. టీపీసీసీ పదవి నుంచి రేవంత్ రెడ్డిని దించేసి ఆ కుర్చీలో కూర్చోవాలనే ఆలోచన ఎవరికీ లేదన్నారు. ఎవరితో చర్చించకుండా రేవంత్ రెడ్డి నిర్ణయాలు తీసుకుంటారంటూ మండిపడ్డారు.రేవంత్ ఎందుకు తొందరపడుతున్నారో తెలియదన్నారు. అలాగే రేవంత్ ను తామేమీ ఇబ్బంది పెట్టడంలేదన్నారు.

రేవంత్ రెడ్డికి పీసీసీ పదవి ఎలా వచ్చిందో అందరికీ తెలుసని జగ్గారెడ్డి అన్నారు. బండి సంజయ్ కి ఉన్న రాజకీయ తెలివి రేవంత్ కి లేదన్నారు . సొంత పార్టీ నేతలను బద్నాం చేయడమే ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారని విమర్శించారు. ఎన్నికల ముందు అడ్డమైన పంచాయతీలు పెట్టుకున్నారని తెలిపారు. తాను ఏ పార్టీలోకి వెళ్లనని.. అవసరమైతే తానే పార్టీ పెడతానని జగ్గారెడ్డి స్పష్టం చేశారు.