మెదక్ లో ఫైనాన్స్ మంత్రి ఉన్నా నిధుల్లేవు

V6 Velugu Posted on Nov 26, 2021

రాష్ట్ర విభజన తర్వాత స్థానిక ప్రజాప్రతినిధులకు పదవులు వచ్చాయి కానీ.. పవర్ లేదన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. మెదక్ లో ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నా.. నిధులు, విధులు లేవన్నారు. ఎన్నికలు వస్తేనే జిల్లా ప్రజలకు మంత్రి హరీశ్ రావు అందుబాటులో ఉంటారని ఆరోపించారు.  మెదక్ లో మాకు 230 ఓట్లు ఉన్నాయన్నారు. గెలిచే ఓట్లు లేకున్నా నా భార్య నిర్మలను అభ్యర్థి గా పెట్టామన్నారు. కాంగ్రెస్ అభ్యర్ధి పెట్టాం కాబట్టి.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ లతో హరీశ్  ఇప్పుడు మాట్లాడుతున్నాడన్నారు. ఉమ్మడి మెదక్ లో ఓక్కో నియోజకవర్గానికి రెండు వేల కోట్ల చొప్పున..10 నియోజక వర్గాలకు 20 వేల కోట్లు స్థానిక సంస్థలకు రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. అలా రిలీజ్ చేస్తే.. నేను ఎమ్మెల్సీ ఎన్నికల పోటీ నుంచి విత్ డ్రా అవుతా అని హరీశ్ కు ఛాలెంజ్ చేస్తున్నానని అన్నారు. నిర్మాలాజగ్గారెడ్డి ని గెలిపిస్తే.. వచ్చే మా ప్రభుత్వంలో జిల్లాకు 20 వేల కోట్లు తీసుకువస్తామన్నారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు గౌరవం ఉండాలన్నారు.

ప్రతిపక్ష పార్టీ అభ్యర్థి ని గెలిపిస్తే.. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల విలువ పెరుగుతుందన్నారు జగ్గారెడ్డి. కాంగ్రెస్ అభ్యర్ధిని పెట్టడంతో.. హరీశ్ రావు తమ పార్టీ ఓటర్లకు ఫోన్ లు చేస్తున్నాడని అన్నారు.  కాంగ్రెస్ ను గెలిపించి రాజా బతుకు బతుకుతారో.. టిఆర్ఎస్ ను గెలిపించి బానిస బతుకు బతుకుతారో మీరే తేల్చుకోండని ప్రజలను కోరారు.

Tagged Medak, jaggareddy, Funding, Finance Minister

Latest Videos

Subscribe Now

More News